13 నుంచి సుప్రీంలో శబరిమల వాదనలు

తాజా వార్తలు

Updated : 07/01/2020 10:54 IST

13 నుంచి సుప్రీంలో శబరిమల వాదనలు

దిల్లీ: శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 13 నుంచి వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ నెల 13 నుంచి వాదనలు విననున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులో పేర్కొంది. శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపైనా విచారణ జరపనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని