ట్రంప్‌తో మాట్లాడిన మోదీ..!

తాజా వార్తలు

Published : 07/01/2020 11:25 IST

ట్రంప్‌తో మాట్లాడిన మోదీ..!

దిల్లీ: భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు పటిష్ఠమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, అమెరికావాసులకు మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఫోన్‌ సంభాషణలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చ జరిగినట్లు తెలిపారు. 2019లో ఉభయ దేశాల మధ్య చోటుచేసుకున్న పురోగతి, 2020లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌ కూడా భారత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో భారత్‌ సుభిక్షంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గత కొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని