‘సీడీఎస్‌’ ఏర్పాటు అతిపెద్ద నిర్ణయం: ఆర్మీ చీఫ్‌

తాజా వార్తలు

Updated : 11/01/2020 16:09 IST

‘సీడీఎస్‌’ ఏర్పాటు అతిపెద్ద నిర్ణయం: ఆర్మీ చీఫ్‌

దిల్లీ: సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ మనోజ్‌ ముకుంద్‌ నరవణే అన్నారు. శనివారం దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సైనికవ్యవహారాల విభాగం(సీడీఎస్‌), మిలటరీ మంత్రిత్వశాఖ ఏర్పాటు నిర్ణయాలు చాలా పెద్దవని వాటిని విజయవంతం అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. ఫూంచ్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌ ఆర్మీ ఇద్దరు నిరాయుధులను హతమార్చడంపై ఆయన స్పందించారు. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం అంగీకరించమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు సైనిక పద్ధతిలోనే తాము సమాధానం ఇస్తామన్నారు. 

సైనికులకు శిక్షణ విషయంలో మేము నాణ్యతనే పరిశీలిస్తాం కానీ సంఖ్యను కాదని అన్నారు. అన్ని విభాగాల్లో సైన్యాన్ని సమర్ధులుగా తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తామని తెలిపారు. ‘భారత రాజ్యాంగానికి కట్టుబడి మేం వ్యవహరిస్తాం. అన్ని సమయాల్లోను అదే మాకు మార్గదర్శకంగా ఉంటుంది’ అని చెప్పారు. జనవరి 6 నుంచి శిక్షణ పొందిన వంద మంది మహిళా జవాన్లు మిలటరీ పోలీసు విధుల్లో చేరినట్లు  ఆయన తెలిపారు. బిపిన్‌ రావత్‌ స్థానంలో ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే గతేడాది డిసెంబరు 31న బాధ్యతలు స్వీకరించారు. రక్షణశాఖ పరిధిలో ఏర్పాటు చేసిన సీడీఎస్‌ అధిపతిగా బిపిన్‌ రావత్‌ నియమితులయ్యారు. దేశ రక్షణ కోసం సైనిక సంస్కరణల్లో భాగంగా త్రివిధ దళాలకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని