నిర్భయ దోషుల ఉరి తేదీ మార్చండి

తాజా వార్తలు

Updated : 16/01/2020 16:56 IST

నిర్భయ దోషుల ఉరి తేదీ మార్చండి

దిల్లీ: నిర్భయ దోషుల ఉరి తేదీని మార్చాల్సిందిగా తీహాడ్‌ జైలు అధికారులు దిల్లీ కోర్టును కోరారు. దోషుల్లో ఒకడైన ముకేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద ఉన్నందున జైలు నిబంధనల ప్రకారం మరణశిక్ష తేదీని మార్చాల్సిందిగా జైలు అధికారులు కోరారు. ఉరి ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే దానికి సంబంధించిన తాజా నివేదికను రేపటి లోగా కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం తీహాడ్‌ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరితీత తేదీ గురించి దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జైలు సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన తాజా నివేదికను అందజేయాల్సిందిగా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి సతీశ్‌కుమార్‌ అరోరా ఆదేశాలు జారీ చేశారు. 
కేంద్రహోంశాఖకు చేరిన క్షమాభిక్ష పిటిషన్‌..
ముకేశ్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్దకు చేరింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు చేశారు. ‘నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్‌  హోంమంత్రిత్వ శాఖ వద్దకు వచ్చింది. ముకేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించింది. తాజా పరిణామాలతో నిర్భయ దోషుల ఉరితీత మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. 
నిర్భయ దోషులకు దిల్లీ కోర్టు గత వారం డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే దోషుల్లో ఇద్దరు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పరిశీలించి న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ రాష్ట్రపతి, దిల్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలు చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవని తీహాడ్‌ జైలు అధికారులు దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని