ఉరి ఆలస్యంలో మా ప్రమేయం లేదు: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Published : 17/01/2020 19:08 IST

ఉరి ఆలస్యంలో మా ప్రమేయం లేదు: కేజ్రీవాల్‌

దిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం లేదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. ఈ విషయంలో నిర్భయ తల్లిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు. ఉరిశిక్ష అమలు జాప్యానికి ఆప్‌ ప్రభుత్వమే కారణమంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘క్షమాభిక్ష పిటిషన్‌ను గంటల వ్యవధిలోనే పంపించాం. ఉరిశిక్ష అమలు ఆలస్యం కావడంలో దిల్లీ ప్రభుత్వ పాత్ర లేదు. అయినా ప్రభుత్వం కావాలని ఎందుకు ఆలస్యం చేస్తుంది? వారికి ఉరిశిక్ష వీలైనంత త్వరగా పడాలని మేమూ కోరుకుంటున్నాం. ఆమె (నిర్భయ తల్లి)ని ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో దిల్లీ ప్రభుత్వం పాత్ర లేనేలేదు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. నిర్భయకు న్యాయం చేయాలని 2012లో రోడ్లపై ఆందోళన చేసిన వారే రాజకీయాల కోసం ఉరిని ఆలస్యం చేస్తున్నారని నిర్భయ తల్లి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఉరి అమలులో జాప్యానికి ఆప్‌ ప్రభుత్వమే కారణమంటూ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

ఇదీ చదవండి..
‘ఆప్‌ వల్లే నిర్భయ దోషుల ఉరి ఆలస్యం’


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని