రాచరిక హోదాను వదులుకోనున్న హ్యారీ దంపతులు!

తాజా వార్తలు

Published : 19/01/2020 20:19 IST

రాచరిక హోదాను వదులుకోనున్న హ్యారీ దంపతులు!

బ్రిటన్‌: ప్రిన్స్‌ హ్యారీ దంపతులు తమ రాచరిక హోదాను, ప్రజా నిధులను వదులుకునేందుకు అంగీకరించారు. ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ నుంచి ఒక ప్రకటన వెలువడింది. రాజ కుటుంబం నుంచి వేరు పడుతున్నట్లు ప్రకటించిన హ్యారీ, వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కెనడాలో తమ వ్యక్తిగత జీవితాన్ని గడపనున్న ఈ దంపతులతో వారం రోజులుగా బ్రిటన్‌ రాజకుటుంబీకులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో హ్యారీతో మాట్లాడిన క్వీన్‌ ఎలిజబెత్‌, అన్ని విషయాల్లో స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు ప్రకటించారు. గత రెండేళ్లల్లో వారు ఎదుర్కొన్న సవాళ్లను తాను గుర్తించానని, స్వతంత్ర జీవితాన్ని గడపాలనుకునే వారి అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నానని ఆమె పేర్కొన్నారు.  అనంతరం ప్రకటన చేసిన బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌, హ్యారీ.. రాజ బిరుదులను వదులుకోవడంతో పాటు ప్రజా నిధుల కింద కేటాయించిన 3.1 మిలియన్‌ డాలర్లను తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. గతంలో హ్యారీ తల్లి ప్రిన్సెస్‌ డయానాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 1996లో ప్రిన్స్‌ చార్లెస్‌ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత డయానా తన బిరుదులను వదులుకున్నారు.  

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని