‘బడ్జెట్‌’ సమావేశాల్లో  ఆర్థికమంత్రి ఎక్కడ?’

తాజా వార్తలు

Published : 23/01/2020 01:37 IST

‘బడ్జెట్‌’ సమావేశాల్లో  ఆర్థికమంత్రి ఎక్కడ?’

పుణె: బడ్జెట్‌ సన్నాహక సమావేశాలన్నీ ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో నిర్వహించారని, ఆ సమావేశాలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించిలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌ ఆరోపించారు. ఆమె పనితీరుపట్ల ప్రధాని మోదీ అంత అసంతృప్తిగా ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘‘సాధారణంగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియ ఆ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలతో మొత్తం 13 ముందస్తు బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆశ్చర్యమేంటంటే.. అందులో ఏ ఒక్క సమావేశానికీ సీతారామన్‌ను ఆహ్వానించలేదు’’ అని చవాన్‌ అన్నారు. ఒకవేళ ప్రధాని మోదీకి ఆమె పనితీరు పట్ల అసంతృప్తి ఉంటే, ఆమెను రాజీనామా చేయాలని సూచించాలని అన్నారు. అంతే తప్ప మొత్తం ఆర్థికమంత్రిత్వ శాఖను భ్రష్టు పట్టించడం సరికాదని చవాన్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని