నిర్భయ దోషులు మనుషులు కాదు మృగాలు

తాజా వార్తలు

Published : 24/01/2020 22:50 IST

నిర్భయ దోషులు మనుషులు కాదు మృగాలు

మేరఠ్‌: నిర్భయ దోషులపై ఏమాత్రం కనికరం చూపించకూడదని మేరఠ్‌కు చెందిన తలారీ పవన్‌కుమార్‌ అన్నారు. ఆయనే ఆ నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్లమీడియా ఆయన్ను కలిసింది. వారితో మాట్లాడేందుకు కేవలం 20 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడట. 

‘ఉరి శిక్ష పడిన వాళ్లను మనుషుల్లా చూడకూడదు. వాళ్లు మృగాలు. చాలా దుర్మార్గులు. అందుకే వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వాళ్లకు మరణశిక్ష విధిస్తేనే నేరాలు తగ్గుతాయి. యావజ్జీవ శిక్ష పడితే వాళ్లు ఏదో ఒక రకంగా బయటకు వస్తారు. కేవలం నేరాలు చేసేందుకు మాత్రమే వాళ్లు బయటకు వస్తారు. అందుకే అలాంటి వాళ్లను ఉరి తీయాలి. అప్పుడే మిగతా వారికి ఇదొక గుణపాఠంగా ఉంటుంది. ఇటువంటి నేరాలు చేయాలంటే భయపడతారు. తమను కూడా ఇదే విధంగా ఉరి తీస్తారనే భయం వాళ్లలో ఉంటుంది’ అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు. ఈ మేరకు దిల్లీ కోర్టు ఇటీవల రెండోసారి డెత్‌ వారెంట్‌ చేసింది. తీహాడ్‌ జైల్లోని మూడో నెంబరు గదిలో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. ఇప్పటికే ఉరి తీతకు సంబంధించిన ట్రయల్స్‌ పూర్తయ్యాయి. 

ఇదీ చదవండి..
మరోసారి కోర్టుకెక్కిన నిర్భయ దోషులు
చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని