ఆ నాయకుల్ని విడుదల చేయండి: అమెరికా

తాజా వార్తలు

Published : 25/01/2020 15:38 IST

ఆ నాయకుల్ని విడుదల చేయండి: అమెరికా

వాషింగ్టన్‌: జమ్మూకశ్మీర్‌లో అధికరణ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతుండడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్‌ సేవల్ని పునరుద్ధరించడం, నిషేదాజ్ఞల్ని తొలగించడం వంటి చర్యలు అభినందనీయమని అభిప్రాయపడింది. అమెరికా విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ అలైస్‌ వెల్స్ ఇటీవల భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. దక్షిణాసియాలో మూడు దేశాల పర్యటన అనంతరం ఆమె అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌ పర్యటన వివరాలను అక్కడి మీడియాతో పంచుకున్నారు. ఇటీవల కశ్మీర్‌లో విదేశీ రాయబారుల పర్యటనను ముందడగుగా అభివర్ణించారు. ఇదే తరహాలో మున్ముందూ దౌత్యవేత్తల్ని కశ్మీర్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకుల్ని వీలైనంత త్వరగా విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఆందోళనలపైనా వెల్స్‌ స్పందించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ప్రభుత్వం నడుచుకోవాలని సూచిస్తున్నామని వ్యాఖ్యానించారు. 

పలు అంశాల్లో భారత్‌-అమెరికా మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన 2+2 చర్చల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా ఆమె చర్చించినట్లు తెలిపారు. అలాగే ఆమోదనీయమైన వాణిజ్య ఒప్పందంపై కూడా దృష్టి సారించామని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని