రిపబ్లిక్‌ డే వేడుకలో కాంగ్రెస్‌ నేతల ఫైట్‌

తాజా వార్తలు

Published : 26/01/2020 15:54 IST

రిపబ్లిక్‌ డే వేడుకలో కాంగ్రెస్‌ నేతల ఫైట్‌

ఇండోర్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. సీఎం కమల్‌నాథ్‌ హాజరు కావడానికి కాసేపు ముందు ఈ ఘర్షణ జరిగింది.

ఇండోర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌ కుంజీర్‌, పార్టీ సీనియర్‌ నేత దేవేంద్ర సింగ్‌ యాదవ్‌ ఒకరికొకరు దూషించుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారు, పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. స్టేజ్‌ వద్దకు కుంజీర్‌ వెళుతుండగా యాదవ్‌ అడ్డు చెప్పడంతో వివాదం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. కొద్ది నిమిషాల తర్వాత సీఎం అక్కడకు చేరకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన పలువురు నెటిజన్లు నేతల తీరుపై మండిపడుతున్నారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని