‘సీఏఏ మా అంతర్గతం’

తాజా వార్తలు

Updated : 27/01/2020 11:41 IST

‘సీఏఏ మా అంతర్గతం’

చట్టంపై ఈయూలో చర్చ చేపట్టనుండడాన్ని ఖండించిన భారత్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఐరోపా సమాఖ్య(ఈయూ)లో చర్చ చేపట్టనుండడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యుల చేత ఆమోదం పొందిన ఓ చట్టాన్ని ప్రశ్నించడం సరైన చర్య కాదని స్పష్టం చేసింది. ఈ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. రెండు సభల్లో సవివర చర్చ అనంతరం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తుచేసింది. తీర్మానాలు ప్రవేశపెట్టిన సభ్యులు తొలుత భారత్‌తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం హితవు పలికింది. చట్టంపై పూర్తి అవకగాహన ఏర్పరచుకోవాలని సూచించింది. 

సీఏఏకి వ్యతిరేకంగా ఈయూలోని పలువురు సభ్యులు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిపై ఈ బుధవారం ఈయూ పార్లమెంట్‌ చర్చ చేపట్టనుంది. తర్వాత రోజు ఈ తీర్మానాలపై ఓటింగ్‌ నిర్వహించనున్నారు. సీఏఏ వివక్షపూరితంగా ఉందని.. దీనిపై ఆందోళనలు చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరిపాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఏ వర్గంపైనా వివక్ష చూపదని స్పష్టం చేసింది. అయినా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని