నిర్భయ దోషి పిటిషన్‌కు అధిక ప్రాధాన్యం

తాజా వార్తలు

Published : 28/01/2020 01:33 IST

నిర్భయ దోషి పిటిషన్‌కు అధిక ప్రాధాన్యం

దిల్లీ: తన పిటిషన్‌ను వెంటనే విచారణ చెయ్యాలని నిర్భయ దోషి ముకేశ్‌ సింగ్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పందించింది. కోర్టు రిజిస్ట్రరీలో ఈ పిటిషన్‌ చేర్చమని అతడి తరఫు న్యాయవాదికి సీజేఐ సూచించారు. ఉరిశిక్ష పడిన వ్యక్తి పిటిషన్‌ విచారణకు మించి అత్యవసరమైనది ఏదీ లేదని ఆయన అన్నారు, ఈ పిటిషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామని సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. సీజేఐతో పాటు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ ధర్మాసనంలో ఉన్నారు. 

తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంపై జ్యూడీషియల్‌ రివ్యూ కోరుతూ ముకేశ్‌ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అతడి క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 17న తిరస్కరించారు. దీనిపై ఆర్థికల్‌ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు.
నిర్భయ దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాల్సిందిగా దిల్లీ న్యాయస్థానం డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. వీరిని జనవరి 22నే ఉరితీయాల్సి ఉండగా ముకేశ్‌ క్షమాభిక్ష అభ్యర్థనతో శిక్ష అమలు వాయిదా పడింది. దీంతో వారికి రెండో సారి డెత్‌ వారెంట్‌ జారీ చేశారు. శిక్ష అమలుకు వారం రోజులు సమయం కూడా లేని సమయంలో ముకేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని