వాళ్లను ఉరితీసేందుకు కొత్త తేదీ ఇవ్వండి

తాజా వార్తలు

Published : 01/02/2020 15:21 IST

వాళ్లను ఉరితీసేందుకు కొత్త తేదీ ఇవ్వండి

దిల్లీ: నిర్భయ కేసు దోషులను ఉరి తీసేందుకు కొత్త తేదీని ఇవ్వాల్సిందిగా తీహాడ్‌ జైలు అధికారులు శనివారం దిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టును ఆశ్రయించారు. దోషి వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో తీహాడ్‌ జైలు అధికారులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉంది. వినయ్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరి అమలును వాయిదా వేస్తూ దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. వినయ్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురవడంతో కొత్త తేదీ ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొంది. అయితే.. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్‌ ఠాకూర్‌ కూడా శనివారం క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ఇప్పటికే నిర్భయ దోషుల ఉరి రెండు సార్లు వాయిదా పడింది. గతంలో జనవరి 22న ఉరి తీయాల్సిందిగా తొలిసారి డెత్‌ వారెంట్‌ జారీ చేయగా అది వాయిదా పడింది. దీంతో మరోసారి ఫిబ్రవరి 1న ఉరి తీయాలని డెత్‌ వారెంట్‌ జారీ చేయగా అది కూడా వాయిదా పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని