స్వైన్‌ ఫీవర్‌కు టీకా విరుగుడు

తాజా వార్తలు

Published : 03/02/2020 23:55 IST

స్వైన్‌ ఫీవర్‌కు టీకా విరుగుడు

ఆవిష్కరించిన భారతీయ పరిశోధకులు 

దిల్లీ: భారత్‌లో పందుల మరణాలకు ఎక్కువగా కారణమవుతున్న ‘క్లాసికల్‌ స్వైన్‌ ఫీవర్‌(సీఎస్‌ఎఫ్‌)’ను నిలువరించే దిశగా సరికొత్త టీకా అందుబాటులోకి వచ్చింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ‘భారతీయ పశు వైద్య పరిశోధన ఇస్టిట్యూట్‌(ఐవీఆర్‌ఐ)’ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. సీఎస్‌ఎఫ్‌తో మానవుల ఆరోగ్యానికి హాని కలగదు. పందుల్లో మాత్రం అది వేగంగా వ్యాప్తి చెందుతూ అత్యంత ప్రాణాంతకంగా మారుతుంది. ఏటా దాదాపు 429 కోట్ల పందులు ఈ వ్యాధితో మృత్యువాతపడుతున్నట్లు అంచనా. దాన్ని నియంత్రించే టీకాల ధర ప్రస్తుతం చాలా ఎక్కువ. ఒక్కో డోసుకు దాదాపు రూ.30 ఖర్చవుతోంది. ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నా.. సరిపడా డోసులు అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో సెల్‌ కల్చర్‌ సాంకేతికతను ఉపయోగిస్తూ తక్కువ వ్యయంతో లక్షల డోసులను ఉత్పత్తి చేసే విధానాన్ని ఐవీఆర్‌ఐ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ఒక్కో డోసును రూ.2కే అందించవచ్చు. 6 నెలల్లో ఈ టీకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని