భారతీయులు రోజుకు రూ.1200 చెల్లించాలి..

తాజా వార్తలు

Published : 05/02/2020 13:21 IST

భారతీయులు రోజుకు రూ.1200 చెల్లించాలి..

థింపూ: తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకులు రోజుకు రూ.1200 ఫీజును చెల్లించాలనే నిబంధన భూటాన్‌ దిగువ సభ ఆమోదాన్ని పొందింది. తమ దేశ సుస్థిరాభివృద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నిబంధన బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకులకు కూడా వర్తిస్తుంది. జులై నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ఈ హిమాలయ రాజ్యం పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్న సంగతి తెలిసిందే. కాగా భారత్‌ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భూటాన్‌ తెలిపింది. ఈ మూడు దేశాల నుంచి భూటాన్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య అంతకుముందు ఏడాది కంటే 2019లో 10 శాతం పెరిగింది. అయితే ఈ బిల్లు భూటాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఇంకా చర్చల్లోనే ఉందని... ఈ ఫీజు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందని భారత అధికారులు అంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని