చైనా అమ్మాయి-బెంగాల్‌ అబ్బాయితో వివాహం

తాజా వార్తలు

Updated : 06/02/2020 20:06 IST

చైనా అమ్మాయి-బెంగాల్‌ అబ్బాయితో వివాహం

కరోనా విజృంభణతో పెళ్ళికి దూరమయిన అమ్మాయి కుటుంబీకులు 


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌కి చెందిన పింటూ ఏడుసంవత్సరాల క్రితం వ్యాపారంలో భాగంగా చైనాకి వెళ్ళాడు. ఆ సమయంలోనే అక్కడ జైకీ అనే అమ్మాయి పరిచయం అయ్యింది. కొన్నిరోజులకు అది కాస్త ప్రేమగా మారింది. విషయం ఇరుకుటుంబ పెద్దలకు తెలియడంతో వాళ్ళు కూడా పెళ్ళికి పచ్చజెండా ఊపారు. తాజాగా పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకొని ముహూర్తం కూడా ఖరారుచేసుకున్నారు. పెళ్ళితేదీ దగ్గరపడటంతో అమ్మాయి ముందుగానే భారత్‌ చేరుకుంది. అంతా సాఫీగా సాగుతుందనే సమయంలో కరోనా ముప్పు ముంచుకొచ్చింది.  దీంతో భారత్‌-చైనా మధ్య విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ కారణంగా అమ్మాయి కుటుంబీకులు భారత్‌ చేరుకోలేకపోయారు. అయితే అనుకున్న సమయానికే బుధవారం నాడు వీరి వివాహం అబ్బాయి ఇంటి దగ్గరే జరిగింది. 

ఇదే విషయమై పెళ్ళి కూతురిని పలుకరించగా..కరోనా వైరస్‌ కారణంగా ఇరుదేశాల మధ్య విమానాల రద్దుతో తమ కుటుంబ సభ్యులు హాజరుకాలేకపోయారని.. అయినప్పటికీ మా పెళ్ళితో వారు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొంది. తిరిగి చైనా వెళ్తారా అని ప్రశ్నించగా?.. పరిస్థితులు అనుకూలించగానే చైనా వెళ్ళి అక్కడ మా పెళ్ళి రిజిస్ర్టేషన్‌ చేయించుకుంటామని తెలిపింది. కానీ, అది ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమంది.  

జైకీ భర్త పింటూ మాట్లాడుతూ..పెళ్ళి మా ఇంటి దగ్గరే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే అంతా సాఫీగా జరిగింది. కానీ పెళ్ళికి అమ్మాయి కుటుంబ సభ్యులు రానందుకు మాత్రం కాస్త బాధగా ఉంది. పరిస్థితులు అనుకూలించగానే చైనా వెళ్ళి అక్కడ రిసెప్షన్‌ జరుపుకుంటామని నవ్వుతూ జవాబిచ్చాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని