కరోనాతో అమెరికా పౌరుడు మృతి

తాజా వార్తలు

Updated : 08/02/2020 12:13 IST

కరోనాతో అమెరికా పౌరుడు మృతి

బీజింగ్‌: కరోనా వైరస్‌ బారినపడి మరణించిన వారి జాబితాలో విదేశీయులు కూడా చేరుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు చైనాలోని ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. కరోనా బారిన పడి మరణించిన తొలి విదేశీయుడు ఇతడే కావొచ్చని భావిస్తున్నారు. 60ఏళ్ల ఓ అమెరికా పౌరుడు వుహాన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6న మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేసిన రాయబార కార్యాయలం.. ఇతర వివరాలేవీ వెల్లడించలేమని తెలిపింది. తమ దేశంలో ఉన్న 19 మంది విదేశీయులకు వైరస్‌ సోకినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

జపాన్‌ పౌరుడు కూడా..!

జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా కరోనా వైరస్‌ ధాటికి మృతిచెందినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అనుమానిస్తోంది. వుహాన్‌లో ఉన్న ఓ 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ఇటీవల తీవ్ర జ్వరం, న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరినట్లు చైనా అధికారులు జపాన్‌కు సమాచారం ఇచ్చారు. చికిత్స అందిస్తుండగానే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వల్లే చనిపోయి ఉంటారని భావిస్తున్నామని జపాన్‌ అధికారులకు సమాచారం చేరవేశారు. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ 724 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. మరో 34 వేల మందికి పైగా వైరస్‌తో పోరాడుతున్నారు.

ఇవీ చదవండి..

చైనాలో కొనసాగుతున్న మృత్యుఘోష

అలుగుతో కరోనా వైరస్‌ వ్యాప్తి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని