ఏడు అంశాలపై స్పష్టతనిచ్చిన సుప్రీం

తాజా వార్తలు

Updated : 10/02/2020 13:19 IST

ఏడు అంశాలపై స్పష్టతనిచ్చిన సుప్రీం

 

దిల్లీ: శబరిమల కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పడిన ధర్మాసనానికి ఉన్న పరిమిత అధికారాల దృష్ట్యా ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను మరో ధర్మాసనం విచారిస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేతో కూడిన ఈ ప్రత్యేక ధర్మాసనం మతవిశ్వాసాలకు సంబంధించిన ఏడు అంశాలను రూపొందించింది. ఈ అంశాలను తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన  ధర్మాససం విచారిస్తుందని నేడు ప్రకటించింది. 

కీలక అంశాలు ఇవే
* మత విశ్వాసాలకు ఉన్న విస్ర్తృతి, పరిధులు, నైతికత
* మతాలకు సంబంధించిన విషయాల్లో న్యాయ సమీక్షాధికారం 
* రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25(2)(బి)లో పేర్కొన్న ‘హిందువు’కు వివరణ
* మత విశ్వాసాల్లో జోక్యం

* మతవిశ్వాసాల్లో వివిధ తెగల మధ్య ఉన్న నమ్మకాల గురించి ఈ విస్త్రృత ధర్మాసనం విచారిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించిన వాదనల కోసం ఐదు రోజుల సమయం ఇస్తున్నట్లు..అవసరమైతే మరో రెండు పొడగిస్తామని ప్రధాన న్యాయమూర్తి బోబ్డే వెల్లడించారు.

నేపథ్యం ఇదీ..

అయితే జనవరి 13నుంచి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం శబరిమల వివాదంతో పాటు, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, మతపరంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన పిటిషన్లపై  విచారణ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం న్యాయవాదులందరూ శబరిమల, ఇతర అంశాలపై ఎలా వాదించాలనే విషయమై చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని