రోడ్డుపై నిరవధిక ఆందోళనలా?: సుప్రీం

తాజా వార్తలు

Published : 10/02/2020 15:06 IST

రోడ్డుపై నిరవధిక ఆందోళనలా?: సుప్రీం

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో కొనసాగుతున్న షాహీన్‌బాగ్‌ నిరసనలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. నిత్యం ప్రజలు తిరిగే రహదారిని నిరవధికంగా దిగ్బంధించవద్దని నిరసనకారులకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వంతో పాటు దిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసింది. సీఏఏ నిరసనకారులను షాహీన్‌బాగ్‌ ప్రాంతం నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. నిత్యం జనం తిరిగే రహదారులను దిగ్బంధించి.. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని సూచించింది. నిరసన తెలిపేందుకు మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని తెలిపింది. 

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను నిరసిస్తూ దక్షిణ దిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ప్రధానంగా మహిళలు, చిన్నారులు దాదాపు రెండు నెలలుగా ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనల కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు ప్రజలకు అసౌకర్యం తలెత్తుతోందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. నిత్యం జనం సంచరించే ప్రాంతంలో నిరవధికంగా ఆందోళనలు చేయవద్దని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని