నిరసనలో 4 నెలల చిన్నారా?: సుప్రీం

తాజా వార్తలు

Published : 10/02/2020 16:22 IST

నిరసనలో 4 నెలల చిన్నారా?: సుప్రీం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

దిల్లీ: షహీన్‌బాగ్‌ నిరసనల్లో మత్యువాత పడిన నాలుగు నెలల చిన్నారి ఉదంతాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సీఏఏపై జరుగుతున్న నిరసన ప్రదర్శన శిబిరానికి మహ్మద్‌ జహాన్‌ అనే నాలుగు నెలల చిన్నారిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.  తరువాత ఇంటికొచ్చిన ఆ చిన్నారి అనారోగ్యంతో మృతిచెందింది. ఈ నేపథ్యంలో ఆందోళనలు, నిరసనల్లో మైనర్లు పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సాహస బాలల అవార్డు అందుకున్న 12 ఏళ్ల జెన్‌ గుణరతన్‌ సదావర్తే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకి లేఖ రాసింది. దీంతో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. 

చిన్నారులను ఆందోళనలకు వెంట తీసుకెళ్లడం సరికాదని, ఈ ఘటన బాధాకరమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణ సందర్భంగా అన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న చిన్నారులను పాకిస్థానీ అని, జాతి వ్యతిరేకులు అంటూ వారి పాఠశాల్లలో ముద్ర వేస్తున్నారంటూ మహిళల తరఫున వాదించిన ఇద్దరు మహిళా న్యాయవాదులు ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త సమస్యలు సృష్టించడానికి ఇది వేదిక కాదని,  అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఇక్కడ కేవలం సుమోటోగా స్వీకరించిన విషయంపై మాత్రమే చర్చ జరగాలని ధర్మాసనం పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. చిన్నారి పాల్గొనకుండా అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడింది. చిన్నారి మరణ ధ్రువీకరణ పత్రంలో ఆమె ఏ కారణంతో చనిపోయిందీ వివరాలు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తంచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని