ఒమర్‌ నిర్బంధంపై పిటిషన్‌.. వైదొలిగిన జడ్జి

తాజా వార్తలు

Published : 12/02/2020 15:39 IST

ఒమర్‌ నిర్బంధంపై పిటిషన్‌.. వైదొలిగిన జడ్జి

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాను నిర్బంధంలో ఉంచడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ ధర్మాసనం నుంచి ఓ న్యాయమూర్తి వైదొలిగారు. తన సోదరుడిని నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ ఒమర్‌ సోదరి సారా అబ్దుల్లా ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎం.ఎం.శాంతనాగౌదార్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో విచారణ ధర్మాసనం నుంచి తాను వైదొలుగుతున్నట్టు జస్టిస్‌ ఎం.ఎం.శాంతనాగౌదార్‌ ప్రకటించారు. అయితే, తాను వైదొలగడానికి కారణాలను మాత్రం ఆయన పేర్కొనలేదు.

సారా తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనున్నారు. గతేడాది ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లాతో పాటు ఆయన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా, మాజీ సీఎం మహబూబా ముఫ్తీతో పాటు పలువురిని నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని