గ్యాస్‌ ధర పెంపుపై రాహుల్‌ వ్యంగ్య ట్వీట్‌

తాజా వార్తలు

Updated : 14/02/2020 11:19 IST

గ్యాస్‌ ధర పెంపుపై రాహుల్‌ వ్యంగ్య ట్వీట్‌

దిల్లీ: వంట గ్యాస్ ధరను భారీగా పెంచిన నేపథ్యంలో భాజపాకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. యూపీఏ హయాం నాటి భాజపా నేతల ఫొటో షేర్‌ చేస్తూ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

యూపీఏ హయాంలో వంట గ్యాస్‌ ధరను పెంచినప్పుడు భాజపా నేతలు స్మృతి ఇరానీ తదితరులు రోడ్లపైకి చేరి గ్యాస్‌ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్‌ తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘సిలిండర్ల ధరను రూ.150 పెంచినందుకు నిరసనగా భాజపా నేతలు చేస్తున్న ఆందోళనలతో నేను ఏకీభవిస్తున్నా’’ అంటూ వ్యంగ్యంగ్యా ట్వీట్‌ చేశారు. దీనికి #RollBackHike అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసి ధర పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశీయంగా వంటగ్యాస్‌ ధరను కేంద్రం ఒక్కసారిగా పెంచిన విషయం తెలిసిందే. సబ్సీడీయేతర సిలిండర్‌పై రూ. 144.5 పెంచింది. ఇదే సమయంలో కేంద్రం ఇచ్చే రాయితీని దాదాపు రెట్టింపు చేసింది. ఏడాదికి తొమ్మిది సిలిండర్ల వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య దాటిన వారు, సబ్సిడీని వదులుకున్న వారికి కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ అందదు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని