రుతుస్రావం పేరిట విద్యార్థినుల పట్ల దారుణం!

తాజా వార్తలు

Published : 15/02/2020 00:32 IST

రుతుస్రావం పేరిట విద్యార్థినుల పట్ల దారుణం!

దిల్లీ: ఈ ఆధునిక కాలంలో ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్నా ఇంకా కొందరు ఆచారాలు, మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. గుజరాత్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. భుజ్‌ ప్రాంతంలోని ఓ మహిళల కాలేజీలో రుతుస్రావాన్ని గుర్తించేందుకు 68 మంది విద్యార్థినులతో బలవంతంగా దుస్తులు విప్పించారు అక్కడి సిబ్బంది. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. కేసును సుమోటాగా తీసుకుని ఘటనపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

భుజ్‌లోని శ్రీ సజానంద్‌ మహిళా ఇనిస్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వామినారాయణ్ మందిర్‌ సభ్యుల ఆధ్వరంలో నడుస్తున్న ఈ కాలేజీలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. రుతుస్రావం వచ్చిన అమ్మాయి కాలేజీ హాస్టల్‌లో ఉండే వంటగది, దేవుడి గదిలోకి రావొద్దనేది అక్కడి నియమం. అయితే గత బుధవారం కొందరు అమ్మాయిలు పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ వంటగదిలోకి వచ్చారని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో సదరు ప్రిన్సిపల్‌ చర్యలు తీసుకున్నారు. 68 విద్యార్థులను రెస్ట్‌రూంకు తీసుకెళ్లి వారిచే బలవంతంగా దుస్తులు విప్పించారు. లోదుస్తులు కూడా తీయించారు. 

ఈ ఘటనకు సంబంధించి వార్త మీడియాలో రావడంతో జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు బాధిత విద్యార్థినులను కలిసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎన్‌సీడబ్ల్యూ ఓ ప్రకటనలో తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని