షాను కలుస్తాం.. షహీన్‌బాగ్‌ నిరసనకారులు

తాజా వార్తలు

Published : 16/02/2020 20:14 IST

షాను కలుస్తాం.. షహీన్‌బాగ్‌ నిరసనకారులు

దిల్లీ: పోలీసుల నుంచి అనుమతి లభించాక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామని షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. ఆదివారం షా నివాసానికి వెళ్లేందుకు ర్యాలీగా బయల్దేరగా.. అనుమతి లేని కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తమ నిరసన శిబిరానికి వెనుదిరిగారు. నిరసనకారుల మార్చ్‌ ఉండడంతో అప్పటికే మోహరించిన పోలీసులు బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అమిత్‌షాను కలిసేందుకు, ఆయన నివాసం వరకు శాంతియుతంగా మార్చ్‌ నిర్వహించేందుకు అనుమతి కోరామని నిరసనకారులు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చాక మార్చ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ దిల్లీలోని షహీన్‌బాగ్‌లో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమిత్‌షా మాట్లాడుతూ.. సీఏఏపై ఎవరైనా తనతో చర్చించాలనుకుంటే తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో షహీన్‌బాగ్‌ నిరసనకారులు అమిత్‌షా నివాసానికి వెళ్లాలని నిర్ణయించడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని