సూపర్‌పవరే కాదు.. విశ్వగురుగా

తాజా వార్తలు

Published : 19/02/2020 11:48 IST

సూపర్‌పవరే కాదు.. విశ్వగురుగా

రాజ్‌నాథ్‌ సింగ్‌

లఖ్‌నవూ: భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు అనేక దేశాలు యత్నిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారత్‌ భవిష్యత్తులో అగ్రరాజ్యంగా ఎదగబోతోందని జోస్యం చెప్పారు. ఇప్పటికే అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న చాలా దేశాలు ప్రజల్లో భయాన్ని పురిగొల్పేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. లఖ్‌నవూలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ కేవలం సూపర్‌పవర్‌గా ఎదగడమేగాక విశ్వగురుగానూ మారబోతోందన్నారు. గురువుతో ఉన్నప్పుడు ఎవరూ భయపడరని.. అలాగే భారత్‌ ఎదుగుదలపై ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు.

మతమార్పిడులపైనా రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛ ప్రజలకు ఉందన్నారు. కానీ, ప్రలోభాల ద్వారా బలవంతపు మతమార్పిడులు చేయించడం కంటే పాపం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని