మోదీ సర్‌ప్రైజ్‌: మేళాకు వెళ్లి ఛాయ్‌ తాగి

తాజా వార్తలు

Updated : 19/02/2020 16:57 IST

మోదీ సర్‌ప్రైజ్‌: మేళాకు వెళ్లి ఛాయ్‌ తాగి

దిల్లీ: ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన షెడ్యూల్‌ నుంచి కాస్తంత విరామం తీసుకున్నారు. దిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతున్న ‘హునర్‌ హాట్‌’ మేళాకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అక్కడి దుకాణదారులతో ముచ్చటించారు. ఉత్తరాది ప్రముఖ స్నాక్‌ లిటి చోఖా తిని మట్టి కప్పులో ఛాయ్ తాగారు. 

ఈ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్‌ సమావేశం పూర్తయిన తర్వాత మోదీ అక్కడి నుంచి నేరుగా మేళాకు వెళ్లారు. ప్రధాని రాక గురించి ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. దీంతో మోదీని చూడగానే అక్కడి అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు మోదీ మేళాను సందర్శించారు. వివిధ స్టాల్స్‌ తిరుగుతూ అక్కడి వస్తువులు, కళా ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలోని సంగీత పరికరాలను వాయించారు. 

ఒక చిరుతిళ్ల దుకాణంలో లిటి చోఖా తిని రూ. 120 చెల్లించారు. మరో దుకాణంలో కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో కలిసి కుల్హద్‌ ఛాయ్‌(మట్టి కప్పులో ఇచ్చే ఛాయ్‌) తాగి రూ. 40 చెల్లించారు. మోదీని చూడగానే దుకాణదారులు, సందర్శకులు తెగ సంబరపడిపోయారు. ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని