వచ్చే నెలలో వంటగ్యాస్‌ ధరలు తగ్గొచ్చు

తాజా వార్తలు

Published : 20/02/2020 17:54 IST

వచ్చే నెలలో వంటగ్యాస్‌ ధరలు తగ్గొచ్చు

రాయ్‌పూర్‌: వచ్చే నెలలో వంట గ్యాస్‌ ధరలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఛత్తీస్‌గఢ్‌ వచ్చిన ఆయన.. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా వంట గ్యాస్‌ ధరలు మరింత పెరగనున్నట్లు   వస్తున్న వార్తలపై ధర్మంద్ర ప్రదాన్‌ను అడగ్గా.. ‘ఎల్‌పీజీ ధరలు ఇకపై నిరంతరంగా పెరుగుతాయనే వార్తల్లో నిజం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగానే ఈ నెలలో గ్యాస్ ధర పెరిగింది. అయితే వచ్చే నెలలో ఈ ధరలు తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి’ అని సమాధానమిచ్చారు. చలికాలంలో ఎల్‌పీజీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. తద్వారా డిమాండ్‌ పెరిగి అది ధరలపై ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. 

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో గతవారం వంట గ్యాస్‌ ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. అయితే వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీని కూడా దాదాపు రెట్టింపు చేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని