మరో 118 మంది కరోనాకు బలి

తాజా వార్తలు

Updated : 21/02/2020 12:18 IST

మరో 118 మంది కరోనాకు బలి

బీజింగ్‌: కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,236కు చేరింది. గురువారం మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది హుబెయ్‌ ప్రావిన్సుకు చెందినవారే. ఇక వైరస్‌ బాధితుల సంఖ్య 75,400 దాటింది. కొత్తగా మరో 889 మందిలో వైరస్‌ జాడను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. బుధవారంతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త పెరిగినప్పటికీ... వైరస్‌ వ్యాప్తి బారీగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. అయితే వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు తొలినాళ్లలో అనుసరించిన విధానాన్నే తిరిగి అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌ అని తేలితేనే బాధితుల కింద పరిగణిస్తున్నారు. ఇంతకుముందు వైరస్‌ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారందర్నీ మహమ్మారి బారినపడ్డట్లుగా లెక్కగట్టారు. తిరిగి పాత విధానంలోకి మారడం వల్లే నమోదిత బాధితుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.

* జపాన్‌ నౌకలో ఉన్న భారతీయుల్లో మరో వ్యక్తి వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు నౌకలో వైరస్ సోకిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 

* దక్షిణ కొరియాలో మరో 52 మందికి వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 156కు చేరింది.

* వుహాన్‌లో ఉన్న ఉక్రెయిన్‌వాసులను ఆ దేశం గురువారం సొంతగడ్డకు తీసుకెళ్లింది. వీరిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడానికి మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో వైరస్‌ ఎక్కడ తమకు వ్యాపిస్తుందోనన్న భయంతో స్థానికులు బాధితుల్ని తరలిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వారు. వారిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులుపైనా దాడికి దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు భారీ భద్రత మధ్య వారిని ప్రత్యేక కేంద్రానికి తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని