ట్రంప్‌ కోసం తాజ్‌ పర్యాటకులకు నో

తాజా వార్తలు

Published : 21/02/2020 19:33 IST

ట్రంప్‌ కోసం తాజ్‌ పర్యాటకులకు నో

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భారత ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి పర్యాటకులను తాజ్‌ సందర్శనకు అనుమతించరని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సూపరింటెండెంట్‌ వసంత్ కుమార్ స్వర్ణకర్ తెలిపారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజ్‌మహల్ సందర్శనకు రానున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఫిబ్రవరి  24 మధ్యాహ్నం 12 గంటల నుంచి సాధారణ ప్రజలు తాజ్‌ను చూసేందుకు అనుమతించం’’ అని తెలిపారు. 

‘‘తాజ్‌ మహల్ పరిసర ప్రాంతాలతో సహా, ట్రంప్‌ ప్రయాణించే మార్గంలో ఉన్న అన్ని ఇళ్ళు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్‌ల క్షుణ్ణంగా తనీఖీ చేశాం. త్వరలోనే వారి గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇప్పటికే కొన్ని ప్రత్యేక బృందాలను ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి’’ అని ఆగ్రా ఎస్పీ బొట్రే రోహన్‌ ప్రమోద్‌ తెలిపారు. అయితే ధ్రువీకరణ ప్రక్రియ సందర్భంగా పోలీసులు తమను ఆధార్‌ కార్డు చూపించమని అడిగారని స్థానిక వ్యాపారులు ఆరోపించారు. తాజ్‌ వరకు సాగే దాదాపు 12 నిమిషాల ప్రయాణంలో భారత సంస్కృతి ట్రంప్‌ కళ్లకు కట్టే విధంగా చూపేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. యమునా నది కాలుష్యం తగ్గించేందుకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని