నా పేరు స్మృతిఇరానీ.. దేశం ఇండియానే

తాజా వార్తలు

Published : 22/02/2020 13:55 IST

నా పేరు స్మృతిఇరానీ.. దేశం ఇండియానే

కేంద్రమంత్రి ఆసక్తికర సమాధానం 

లఖ్‌నవూ: కేంద్రమంత్రి స్మృతిఇరానీకి ఈ మధ్య పేరు కష్టాలు మొదలయ్యాయట. ఆమె పేరులో ఇరానీ అనే పదాన్ని చూసి విదేశీ విమానాశ్రయాల్లో అడ్డుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. అయితే అలాంటి సమయాల్లో తాను చెప్పే సమాధానం ఒకటే అని.. ‘నేను భారత్‌కు చెందిన ఇరానీని’ అని చెబుతానని అంటున్నారామె. 

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో జరుగుతున్న హిందుస్థాన్ శిఖర్‌ సమాగమ్‌ కార్యక్రమంలో స్మృతిఇరానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విదేశాల్లో తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పారు. ‘‘నా పేరు చివర ఇరానీ అని ఉంటుంది. ఈ పేరు చూసి విదేశీ విమానాశ్రయాల్లో కొందరు అధికారులు నన్ను ఆపి ‘ఇది ఏ ఇరానీ’ అని అడుగుతుంటారు. అప్పుడు వాళ్లకు ‘నేను ఇండియా వాలీ ఇరానీ’ అని చెబుతా’’ అని స్మృతి చెప్పుకొచ్చారు. 

అమేఠీలో ఇళ్లు కట్టుకుంటున్నా..

ఈ సందర్భంగా తన లోక్‌సభ నియోజకవర్గం అమేఠీ గురించి ప్రస్తావించారు. తనను గెలిపించిన అమేఠీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు ఇక్కడే ఇళ్లు కట్టుకుంటున్నా అని స్మృతి చెప్పారు. ‘నేను ముంబయి నుంచి ఎప్పుడో వచ్చేశా. అమేఠీలో మా ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. ఇక అమేఠీ, దిల్లీల్లోనే ఉంటా’ అని స్మృతిఇరానీ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని