చైనా విద్యార్థులకు ద్వారాలుతెరిచిన ఆస్ట్రేలియా..!

తాజా వార్తలు

Published : 23/02/2020 02:17 IST

చైనా విద్యార్థులకు ద్వారాలుతెరిచిన ఆస్ట్రేలియా..!

విద్యార్థులను అనుమతిస్తూ తాజా నిర్ణయం..!

మెల్‌బోర్న్‌:  గత మూడు నెలలుగా కరోనా వైరస్‌తో సతమతమవుతోన్న చైనా విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఆస్ట్రేలియా. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో చదువుకునే చైనీయులను తమ దేశంలోకి రాకుండా గతనెలలో ప్రకటించిన తాత్కాలిక నిషేధాన్ని సడలిస్తున్నట్లు పేర్కొంది. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుకునే చైనా విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంటుంది. దాదాపు 40శాతం చైనా విద్యార్థులు ఉండటం విశేషం. ఇది ఆస్ట్రేలియా ఆర్థికవ్యవస్థకు ఎంతో దోహదం చేస్తోంది. అయితే తమ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకంగా ఉండే విద్యార్థుల చదువు కొనసాగించేందుకు తిరిగి ద్వారాలు తెరుస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. వేసవి సెలవులు ఉండడంతో కొందరు విద్యార్థులు తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు. అనంతరం తిరిగి వచ్చే సమయంలోనే కరోనా విజృంభించడంతో చైనా విద్యార్థులపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సు కాకుండా మిగతా ప్రాంతాలకు చెందిన వారిని తిరిగివచ్చేందుకు అనుమతినిచ్చింది.

అయితే తాజా నిర్ణయం ఎంతో మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. ఇలా వచ్చిన వారిని 14రోజుల పాటు ప్రత్యేకంగా ఉంచిన తరువాతే వారిని అనుమతిస్తామని ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే భాగంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి విద్యాశాఖ మంత్రి మీడియాకు తెలిపారు. మిగతా విద్యార్థులపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే పర్యాటకులపై మాత్రం ఈ నిషేధం కొనసాగుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని