‘సోకడం తగ్గింది.. కోలుకోవడం పెరిగింది’

తాజా వార్తలు

Published : 23/02/2020 10:38 IST

‘సోకడం తగ్గింది.. కోలుకోవడం పెరిగింది’

కరోనాపై చైనా ప్రభుత్వం

బీజింగ్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి చైనాకు వెళ్లిన నిపుణులు కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సుని శనివారం సందర్శించారు. స్థానిక వైద్యాధికారులతో కలిసి అక్కడి ప్రజలు, బాధితులతో మాట్లాడారు. ఈ బృందంలో అమెరికా, జర్మనీ, జపాన్‌, నైజీరియా, రష్యా, సింగపూర్‌, దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు ఉన్నారు. తొలుత వీరిని వుహాన్‌కు అనుమతించడానికి చైనా ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. చివర్లో అంగీకరించడం గమనార్హం. ఇక వైరస్‌ ధాటికి నిన్న మరో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 96 మంది హుబెయ్‌కు చెందినవారే. మృతుల సంఖ్య 2,442కు చేరింది. మరో 648 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 76,936కు చేరింది. హుబెయ్‌ ప్రావిన్సులో 630 కొత్త కేసులు నమోదుకాగా.. అక్కడ వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 64,084కు తాకింది. కొత్తగా వైరస్‌ సోకుతున్న వారి కంటే కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్యే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు 22,888 మంది వైరస్‌ నుంచి విముక్తి పొందినట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని