తాజ్‌మహల్‌.. సందర్శకులకు నో ఎంట్రీ!

తాజా వార్తలు

Updated : 24/02/2020 12:20 IST

తాజ్‌మహల్‌.. సందర్శకులకు నో ఎంట్రీ!

 

ఆగ్రా: భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబంతో సహా ఈ సాయంత్రం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు.. సందర్శకులను మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఉదయం 11.30గంటలలోపు టికెట్‌ తీసుకున్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలియజేశారు. భద్రత కారణాల దృష్ట్యా మధ్యాహ్నం నుంచి తాజ్‌మహల్‌లో సందర్శకులు ఎవరూ లేకుండా చూస్తామని తెలిపారు. ఈ సాయంత్రం 5.15  గంటలకు ట్రంప్‌ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించి గంటపాటు ఇక్కడ గడిపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రాతో పాటు తాజ్‌మహల్ పరిసరాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని