దేశంలో హింసకు తావులేదు: సోనియా గాంధీ

తాజా వార్తలు

Published : 25/02/2020 13:45 IST

దేశంలో హింసకు తావులేదు: సోనియా గాంధీ

దిల్లీ హింసాత్మక ఘటనలపై సోనియా ఆవేదన 

దిల్లీ: దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించేవారిని ఉపేక్షించేదిలేదని, మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో హింసకు తావులేదన్నారు. ఈసమయంలో యావత్ దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా దిల్లీ ప్రజలను అభ్యర్థించారు. సోమవారం జరిగిన అల్లర్లలో మరణించిన హెడ్‌కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు కలవరపెడుతున్నాయని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలియజేయడమే ఆరోగ్యకర ప్రజాస్వామ్యమని అన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక నిరసనకారులతో ఈశాన్య దిల్లీలో సోమవారం చెలరేగిన అల్లర్లు మంగళవారం కూడా కొనసాగినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఇప్పటివరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని