దిల్లీ ఘటనలు విచారకరం: సుప్రీంకోర్టు

తాజా వార్తలు

Updated : 26/02/2020 17:57 IST

దిల్లీ ఘటనలు విచారకరం: సుప్రీంకోర్టు

దిల్లీ: ఈశాన్య దిల్లీ ఘటనలపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు నిరాకరించింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై ఈరోజు విచారించింది. ఇప్పటికే ఈ అంశంపై దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోందని, ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేసిందని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి పోలీసులు ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. దీంతో హైకోర్టే దీనిపై పూర్తి విచారణ కొనసాగిస్తుందని వ్యాఖ్యానిస్తూ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తులు పరిస్థితిని అదుపులోకి తేవడంలో సమర్థంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆదేశాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదని.. ఘర్షణలు ప్రేరేపించే ప్రకటనలు చేసే వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. దిల్లీ పోలీసుల పనితీరును తాము శంకించడం లేదని పరిస్థితులను నిలువరించాన్న సదుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడింది. 

మరోవైపు షాహీన్‌ బాగ్‌ నిరసనలపై దాఖలైన పిటిషన్ల విచారణను మార్చి 23కు వాయిదా వేసింది. వాతావరణాన్ని శాంతపరిచేందుకు అన్ని పార్టీలు కృషిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆ తర్వాతే విచారణ చేపడతామని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని