పాక్‌లో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

తాజా వార్తలు

Updated : 29/02/2020 17:06 IST

పాక్‌లో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న రైలును బస్సు ఢీకొట్టిన ఘటనలో కనీసం 20 మంది మృతిచెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సింధ్‌ ప్రావిన్సులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రావల్పిండి నుంచి కరాచీ వెళుతున్న రైలును ఓ క్రాసింగ్‌ వద్ద బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కొంతమంది పిల్లలు సహా కనీసం 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్రాసింగ్‌ వద్ద సిబ్బంది లేకపోవడమే ప్రమాదానికి దారి తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని