‘పాక్‌ ఆర్మీయే ఉగ్రవాదానికి కేంద్రం’

తాజా వార్తలు

Updated : 29/02/2020 13:46 IST

‘పాక్‌ ఆర్మీయే ఉగ్రవాదానికి కేంద్రం’

ఐరాస ముందు నిరసన వ్యక్తం చేసిన ఆ దేశ మైనారిటీలు

జెనీవా: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తమ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ మైనారిటీలు ఐక్యరాజ్య సమితి మావన హక్కుల సంఘం(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) వార్షిక సమావేశం వేదిక వద్ద నిరసన తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న పాక్‌ ప్రపంచ భద్రతకే ముప్పు తెస్తోందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే యూఎన్‌హెచ్ఆర్‌సీ 43వ వార్షిక సమావేశాన్ని పురస్కరించుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జెనీవాలోని పాక్‌ మైనారిటీలకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రకటనను విడుదల చేసింది. ‘‘9/11 దాడుల నుంచి పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారింది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుగా ఉన్న నార్త్ వజీరిస్థాన్‌ ప్రాంతం అల్‌ఖైదా, తాలిబన్ వంటి ఉగ్రసంస్థలకు కేంద్రంగా ఉంది’’ అని ప్రకటనలో పేర్కొంది. ‘అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ సైన్యం కేంద్రం’గా ఉందంటూ జెనీవాలోని ఐరాస కార్యాలయం వద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు.

తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుతున్నాయని.. తద్వారా వారి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగించుకుంటున్నాయని పాక్‌ మైనారిటీలు తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పాక్ ప్రభుత్వం వల్ల కాదని.. కఠిన చర్యల ద్వారా పాక్‌ దారికి వచ్చేలా చూడాలని ఐరాసను కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని