సరిహద్దులు మూసేస్తూ పాక్‌ నిర్ణయం

తాజా వార్తలు

Published : 02/03/2020 01:33 IST

సరిహద్దులు మూసేస్తూ పాక్‌ నిర్ణయం

ఇస్లామాబాద్‌: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో దాన్ని అడ్డుకునేందుకు పాకిస్థాన్‌ తన సరిహద్దులు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు అఫ్గానిస్థాన్‌తో సరిహద్దులను మూసివేయనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పాక్‌లో ఇప్పటికే నాలుగు కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఈక్రమంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్‌ నుంచి రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈమేరకు బలూచిస్థాన్‌లోని చమాన్‌ వద్దనున్న సరిహద్దును 7 రోజుల పాటు అధికారులు మూసి వేయనున్నారు.

యితే, ఈ నిర్ణయం ఇరుదేశాల ఏకాభిప్రాయంతోనే జరిగిందని పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. వైరస్‌ నుంచి ఇరుదేశాల ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. అంతేకాదు ఇరాన్‌ నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన దాదాపు 8,000 మంది యాత్రికులను గుర్తించేందుకు పాక్‌ చర్యలు చేపట్టింది. 200 మంది యాత్రికులను టాఫ్తాన్‌ సరిహద్దులో నిర్బంధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని