నిర్భయ కేసు: ‘ఉరితీత’పై స్టేకు నిరాకరణ

తాజా వార్తలు

Updated : 02/03/2020 14:10 IST

నిర్భయ కేసు: ‘ఉరితీత’పై స్టేకు నిరాకరణ

దోషి పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ వేసిన పిటిషన్‌ను దిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు సోమవారం కొట్టేసింది. ఉరితీతకు సమయం దగ్గరపడుతుండగా అక్షయ్‌ గత శుక్రవారం మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్‌ వేసినందున డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ అక్షయ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. అక్షయ్‌ గతంలో క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ దాన్ని తిరస్కరించారు. 

క్షమాభిక్షకు అభ్యర్థన పెట్టుకున్న పవన్‌ గుప్తా..

ఇదిలా ఉండగా.. ఉరితీతకు ఒక్క రోజు ముందు మరో దోషి పవన్‌ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. దీనికి ముందు పవన్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో అతడు తనకున్న చిట్టచివరి అవకాశమైన క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పటియాల కోర్టుకు వెల్లడించారు. ఈ అంశంపై న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది. మరోవైపు నిర్భయ దోషులను రేపు(మార్చి 3) ఉదయం ఉరితీసేందుకు తిహాడ్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

నిర్భయ దోషి క్యురేటివ్‌ పిటిషన్‌ తిరస్కరణAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని