అమెరికాలో తొమ్మిదికి చేరిన కొవిడ్‌ మృతులు

తాజా వార్తలు

Updated : 04/03/2020 10:51 IST

అమెరికాలో తొమ్మిదికి చేరిన కొవిడ్‌ మృతులు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికిచ చెందినవారే. మరోవైపు బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారం 115 మందికి కొవిడ్‌ సోకినట్లు గుర్తించారు. మరో 38 మంది మృత్యువాతపడడంతో మృతుల సంఖ్య 2,981కి చేరింది. ఇక దక్షిణ కొరియాలో 142 మంది కొత్తవారికి వైరస్‌ సంక్రమించినట్లు ధ్రువీకరించారు. దీంతో బాధితుల సంఖ్య 5,528కి తాకింది. మంగళవారం మరో నలుగురు మరణించడంతో మృతుల సంఖ్య 32కు చేరింది. వివిధ దేశాల్లో కొవిడ్‌ మరణాలు, బాధితుల సంఖ్య ఇలా ఉంది... 

దేశం  బాధితుల సంఖ్య మరణాల సంఖ్య
చైనా 80,270 2,981
దక్షిణ కొరియా 5328 32
ఇరాన్‌ 2,336 77
ఇటలీ 2,263 79
అమెరికా 108 09
జపాన్‌ 294 06
ఫ్రాన్స్‌ 204 04
హాంకాంగ్‌ 100 02
భారత్‌  06 00
ప్రపంచవ్యాప్తంగా 92,787 3,201

* అర్జెంటీనాలో తొలికేసు నమోదైంది. బాధితుడు ఇటీవల ఇటలీ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 

* హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దుబాయ్‌ నుంచి అతను ఇండిగో విమానంలో ఫిబ్రవరి 20న భారత్‌కు వచ్చాడు. దీంతో ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బందిని ఇంట్లోనే ఉండాలని ఇండిగో సంస్థ ఆదేశించింది.

* భారత నావికాదళం విశాఖపట్నంలో ఈ నెలలో జరగాల్సిన ‘మిలన్‌-2020’ విన్యాసాలను వాయిదా వేసింది. దీంట్లో దాదాపు 30 దేశాలు పాల్గొనాల్సి ఉంది.

* ఇటు భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలో ఆరుగురు అనుమానితుల్ని ప్రభుత్వం వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. ఇప్పటి వరకు 149 మందికి పరీక్షలు జరపగా.. అందరికీ నెగటివ్‌ అని తేలినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు నివేదికలు రావాల్సి ఉంది.

ఇవీ చదవండి...

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బాధితుడు?

నమస్కార్‌ కరోనా!

కొవిడ్‌ కట్టడికి ప్రపంచ బ్యాంకు నిధి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని