ఇమ్రాన్‌ హోలీ శుభాకాంక్షలు.. పలువురి ఆగ్రహం

తాజా వార్తలు

Published : 10/03/2020 16:08 IST

ఇమ్రాన్‌ హోలీ శుభాకాంక్షలు.. పలువురి ఆగ్రహం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశానికి చెందిన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో ఉన్న హిందువులకు హోలీ శుభాకాంక్షలు చెప్పడమే ఇందుకు కారణం. భారత్‌లో చేసుకున్నట్లుగానే పాకిస్థాన్‌లోనూ హిందువులు అన్ని పండుగలు చేసుకుంటుంటారు. మంగళవారం హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. ‘మన హిందూ సమాజానికి రంగులతో నిండిన హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ హిందూ సమాజానికి ఓదార్పు, భద్రతకు మూలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ఇమ్రాన్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. ఈ విషయం తీవ్రమైన భావాలున్న కొంతమంది అతివాదులకు మింగుడుపడలేదు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఇమ్రాన్‌పై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ఒక  ప్రధాని అయివుండి హిందువులకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. మరికొంత మంది మాత్రం.. పాకిస్థాన్‌లో హిందువులు, ముస్లింలు సమానమేనని, ఎవరి హక్కులు వాళ్లకు ఉంటాయన్న విషయాన్ని ప్రధాని మరోసారి చాటిచెప్పారని కొనియాడుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని