ఫరూక్‌ అబ్దుల్లాపై గృహ నిర్బంధం ఎత్తివేత

తాజా వార్తలు

Updated : 13/03/2020 16:08 IST

ఫరూక్‌ అబ్దుల్లాపై గృహ నిర్బంధం ఎత్తివేత

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై ఉన్న గృహ నిర్బంధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఏడు నెలల నిర్బంధం అనంతరం ఆయన విడుదల కానున్నారు. ఆయనపై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్‌ఏ) ఉపసంహించారు. కేంద్ర హోంశాఖ సూచన మేరకు గవర్నర్‌ ఆదేశాలతో ఫరూక్‌పై ఉన్న నిర్బంధాన్ని స్థానిక ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడం.. శాంతియుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే గవర్నర్‌ తుది ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పార్లమెంటు సభ్యుడైన ఫరూక్‌ ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. 

అధికరణ 370 రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫరూక్‌పై పోలీసులు నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. మధ్యలో చాలా మంది నేతలు ఆయన్ని కలిసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు సుప్రీంకోర్టుని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. సెప్టెంబరు 17న విధించిన పీఎస్‌ఏని డిసెంబరు 13 మరో మూడు నెలల పాటు పొడగించారు. ఫరూక్‌ కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా మరికొంత మంది నేతలు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని