చచ్చిపోతాం: నిర్భయ దోషుల తల్లిదండ్రులు

తాజా వార్తలు

Updated : 16/03/2020 12:26 IST

చచ్చిపోతాం: నిర్భయ దోషుల తల్లిదండ్రులు

దిల్లీ: తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురు నిందితుల కుటుంబసభ్యులు ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అనుమతి కోరుతూ లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో నిందితుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, దోషుల పిల్లలు ఉన్నారు. ‘‘మేం కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని మిమ్మల్ని (రాష్ర్టపతి), బాధితురాలి తల్లిదండ్రులను కోరుతున్నాము. భవిష్యత్తులో నిర్భయ వంటి నేరాలు జరగకుండా ఆపవచ్చు. కోర్టు కూడా ఒకరి స్థానంలో ఐదుగురిని ఉరి తీయాల్సిన అవసరం ఉండదు. మన దేశంలో పెద్ద తప్పులు చేసిన వ్యక్తులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రతీకారం అధికారానికి నిర్వచనం కాదు. క్షమించడంలో కూడా అధికారం ఉంది’’ అని వారు లేఖలో పేర్కొన్నారు.

నిర్భయ దోషులు వినయ్‌ శర్మ, అక్షయ్‌ సింగ్ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, ముఖేష్ సింగ్‌లను 2020 మార్చి 20 ఉదయం 5:30కి ఉరితీయాలని దిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దోషులందరి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. అయితే కొద్ది రోజుల క్రితం అక్షయ్‌ సింగ్ ఠాకూర్‌ రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. గతంలో తన క్షమాభిక్ష పిటిషన్‌లో పూర్తి వాస్తవాలు జతపరచలేదని, దాని కారణంగానే అది తిరస్కరణకు గురైందని ఆ దరఖాస్తులో పేర్కొన్నాడు. ఇప్పటికే నలుగురు దోషులు దాఖలు చేసిన పలు పిటిషన్లు దిల్లీ కోర్టు, దిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని