అప్పుడు నేను దిల్లీలోనే లేను: నిర్భయ దోషి

తాజా వార్తలు

Updated : 17/03/2020 14:35 IST

అప్పుడు నేను దిల్లీలోనే లేను: నిర్భయ దోషి

దిల్లీ: ఉరి అమలు తేదీ దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషులు శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా దిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను దిల్లీలోనే లేనని పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని దిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తిహాడ్‌ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. ఈ మేరకు దిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్‌ని ఉంచాడు. ఈ నెల 20న ఉదయం 5:30గంటలకు ఉరితీయాలని మార్చి 5న ట్రయల్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరణశిక్ష అమలు వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌సింగ్‌ (32) శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ మూడుసార్లు వాయిదా పడింది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి, మార్చి 2న మూడో సారి డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడింది. చివరకు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తలుపులు కూడా తట్టారు. తమకు ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ఈ మేరకు ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు తనకున్న చట్టపరమైన పరిష్కార మార్గాలన్నిటినీ పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ముకేశ్‌ సింగ్‌ దాఖలు చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని