పశ్చిమబెంగాల్‌లో తొలి కరోనా కేసు నమోదు

తాజా వార్తలు

Published : 17/03/2020 23:22 IST

పశ్చిమబెంగాల్‌లో తొలి కరోనా కేసు నమోదు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన 18 సంవత్సరాల ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అతడికి వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో యువకుడిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కాగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 15 వరకు పాఠశాలలకు సెలవులు వెల్లడించింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూ.200కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని