కరోనా ఎఫెక్ట్‌: కేరళలో ఇంటికే పుస్తకాలు

తాజా వార్తలు

Published : 20/03/2020 00:43 IST

కరోనా ఎఫెక్ట్‌: కేరళలో ఇంటికే పుస్తకాలు

                                                                                                    

త్రివేండ్రం: కేరళ ప్రభుత్వం కరోనా వల్ల స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఇటీవలే మధ్యాహ్న భోజనాన్ని, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే సరకులను నేరుగా ఇంటికే పంపుతున్న కేరళ ప్రభుత్వం ఇప్పుడు పుస్తకాలను కూడా పంపేందుకు సన్నద్ధమైంది. కేరళలోని ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ డీసీ బుక్స్‌ దీనికి ముందుకు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ హర్షం వ్యక్తం చేస్తూ మరిన్నింటిని ఏర్పాటు చేయాలని వారిని కోరారు. పుస్తక పంపిణీ కోసం డీసీ బుక్స్‌తో వైద్యశాఖ కలిసి పనిచేస్తుంది. వైద్య సిబ్బంది ఇళ్లకే వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తారు.

కరోనా ప్రాబల్యం ఉన్న దేశాల నుంచి తిరిగి వచ్చిన వారు తప్పని సరిగా 14 రోజులు పాటు నిర్బంధంలో ఉండాలన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వరకు కేరళలో 25వేల మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ 14 రోజులు నిర్బంధంలోనే ఒంటరిగా ఉండటం మూలానా మానసికంగా సమస్యలు వస్తాయి. టీవీ చూస్తూ ఇంకా ఇతరత్రా కాలక్షేపాలతో అన్ని రోజులు ఒంటరిగా ఇంట్లో గడపడం కష్టమైన పని. అలాంటప్పుడు పుస్తకాలు మంచి సాంత్వనని కలిగిస్తాయని డీసీ బుక్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి  తెలిపారు. అందుకోసం ఉచితంగా పంపిణీ చేసేందుకు ఈ పుస్తకాలను జిల్లా వైద్యాధికారులకు అందజేస్తున్నామని, నచ్చిన మలయాళ పుస్తకాలను తీసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ పథకాన్ని 8 జిల్లాల్లో ఆరంభించారు. వీరే కాదు మరి కొన్ని అంతర్జాల ప్రచురణ సంస్థలు నెల వరకు ఉచితంగా చదువుకునే వీలును కల్పించాయి. కేరళ రాష్ట్ర గ్రంథాలయ కౌన్సిల్‌ కూడా తమ గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను పంపేందుకు యోచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు డీసీ బుక్స్ వారు పంపిణీ చేసిన పుస్తకాలను తిరిగి తీసుకోవట్లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని