న్యాయమే గెలిచింది: మోదీ

తాజా వార్తలు

Updated : 20/03/2020 14:34 IST

న్యాయమే గెలిచింది: మోదీ

దిల్లీ: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ఎట్టకేలకు న్యాయమే గెలించింది. మహిళలకు భద్రత, గౌరవాన్ని కల్పించడం చాలా ముఖ్యం. ప్రతి రంగంలో మన మహిళా శక్తి రాణిస్తోంది. మహిళా సాధికారితకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించే మెరుగైన సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా దోషుల ఉరిపై స్పందించారు. ‘‘దేశ చరిత్రలో అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన దోషులకు ఉరి పడింది. ఇది ఎప్పుడో జరగాల్సిందని నా అభిప్రాయం. దోషులుగా తేలిన వారు ఏడేళ్ల పాటు శిక్ష అమలును ఆలస్యం చేయడానికి వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి విధానాలను కొనసాగించాలో.. లేదో.. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌరసమాజం ఆలోచించాల్సిన రోజిది’’ అని రవిశంకర్‌ అభిప్రాయపడ్డారు.  

నిర్భయ కేసులో దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ ఠాకూర్‌ (31)లను తిహార్‌ జైలులో ఈరోజు ఉదయం 5:30గంటలకు ఉరి తీశారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చివరి క్షణం వరకూ వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వారు దాఖలు చేసిన పిటిషన్లంటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని