కరోనా ఎఫెక్ట్‌.. విడుదల కానున్న 3000 ఖైదీలు

తాజా వార్తలు

Published : 24/03/2020 14:41 IST

కరోనా ఎఫెక్ట్‌.. విడుదల కానున్న 3000 ఖైదీలు

తిహాడ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సుమారు 3000 ఖైదీలను విడుదల చేయడానికి తిహాడ్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘సుమారు 1,500 ఖైదీలను పెరోల్‌పైన, అదే సంఖ్యలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై రానున్న మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తాం. కరోనా వైరస్‌ (కొవిడ్-19) నేపథ్యంలో జైళ్లలో రద్దీని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం.’’ అని జైళ్లశాఖ డైరక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ ప్రకటించారు. అయితే విడుదలయ్యే వారిలో తీవ్ర నేరాలు చేసినవారు, కరడుగట్టిన ఖైదీలు ఉండరని ఆయన వివరించారు.  

దేశవ్యాప్తంగా ఉన్న 1,339 జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి 4,66,084 మంది ఖైదీలు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలకే కాకుండా జైలు సిబ్బంది, సందర్శకులు, న్యాయవాదులకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. జైళ్లలోని ఖైదీలకు కూడా కొవిడ్‌-19 సోకే అవకాశముందనే వాదనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ఆదేశానుసారం.. ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశమున్న ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు వివరించారు. కాగా, వీరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై విడిచిపెట్టే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని