తిహాడ్‌ నుంచి 400 మంది ఖైదీలు విడుదల!

తాజా వార్తలు

Published : 29/03/2020 10:43 IST

తిహాడ్‌ నుంచి 400 మంది ఖైదీలు విడుదల!

దిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా తిహాడ్‌ జైలులోని 419 మంది ఖైదీలను శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్‌పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో శనివారం 419 మందిని విడుదల చేశారు. మరికొంత మందిని రానున్న కొన్ని రోజుల్లో ఇళ్లకు పంపుతామని తెలిపారు.

జైలు నిబంధనల ప్రకారం ఇంతకు ముందు కేవలం నాలుగు వారాల పెరోల్‌ మాత్రమే అనుమతించేవారు. కానీ, తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దిల్లీ ప్రభుత్వం ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. తిహాడ్‌ జైలు సామర్థ్యం 10వేలు. కానీ, ప్రస్తుతం అక్కడ 18 వేల మంది ఖైదీలు ఉన్నట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ 71 కారాగారాల్లోని 11 వేల మంది ఖైదీల్ని ప్రభుత్వం నిన్న విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని