కరోనా సమాచారం కోసం ప్రభుత్వ ట్విటర్‌ ఖాతా...

తాజా వార్తలు

Published : 01/04/2020 14:23 IST

కరోనా సమాచారం కోసం ప్రభుత్వ ట్విటర్‌ ఖాతా...

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్-19) విస్తరిస్తోంది. అయితే దీనికంటే ముందే ఈ మహమ్మారిపై వదంతులు మరింత వేగంగా వ్యాప్తిస్తూ... ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. కొవిడ్‌-19నుపై నెట్టింట్లో వెల్లువెత్తుతున్న సమాచారంలో సత్యాసత్యాలను తెలుసుకోలేక సాధారణ పౌరులు ఆందోళనకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం  #IndiaFightsCorona (ఇండియాఫైట్స్‌కరోనా) అనే పేరుతో హ్యాష్‌టాగ్‌ను ప్రారంభించింది. ‘‘సరైన సమాచారాన్ని పొందటం చాలా ముఖ్యం... నావెల్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను గురించిన అధికారిక, తాజా సమాచారం కోసం @COVIDNewsbyMIB ఖాతాను అనుసరించండి’’ అని ప్రభుత్వ సమాచారశాఖ ప్రకటించింది. ఈ ఖాతాలో తొలుత 24గంటలూ కొవిడ్‌ సమాచారాన్ని అందించే సహాయ కేంద్రాల ఫోన్‌నెంబర్లను ట్వీట్‌ చేశారు.  

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని